తెలుగు రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ చక్ర’.. 16 మంది అరెస్ట్, 170 మంది కోసం గాలింపు

by srinivas |   ( Updated:2024-09-30 15:21:47.0  )
తెలుగు రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ చక్ర’..  16 మంది అరెస్ట్, 170 మంది కోసం గాలింపు
X

దిశ, వెబ్ డెస్క్: సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఆన్‌లైన్ టెక్నాలజీని అడ్డుపెట్టుకుని డబ్బులు కొట్టేస్తున్న అక్రమార్కుల భరతం పడుతోంది. ‘ఆపరేషన్ చక్ర’ పేరుతో తనిఖీలకు దిగింది. దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, విశాఖతో పాటు పుణె, అహ్మదాబాద్‌లో ముమ్మరంగా తనిఖీలు చేపటింది. హైదరాబాద్‌లో ఐదుగురు, విశాఖలో 11 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసింది. భారీగా నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకుంది. దేశవిదేశాల్లో ఉన్న వారిని ఈ క్రిమినల్స్ టార్గెట్ చేసినట్లు సీబీఐ గుర్తించింది. మొత్తం 170 మంది సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో విశాఖలో వీసీ ఇన్ ఫ్రా మ్యాట్రిక్స్, అత్రియా గ్లోబల్ సర్వీసెస్‌తో పాటు హైదరాబాద్‌లో వీఏజెక్ సొల్యూషన్స్‌లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed