Divvela Madhuri : దివ్వెల మాధురి పై కేసు నమోదు

by Mahesh |   ( Updated:2024-08-12 06:36:50.0  )
Divvela Madhuri : దివ్వెల మాధురి పై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం గంట గంటకు ఓ మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య, అలాగే మధ్యలో వచ్చిన దివ్వెల మాధురిల వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మాధురి పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ.. తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, తన పై ట్రోల్స్ ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం రోడ్డుపై ఆగి ఉన్న కారును తన కారుతో ఢీకొట్టగా ఆమెకు గాయాలయ్యాయి. అనంతరం ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడుతూ.. తనకు బ్రతకాలని లేదని.. తనపై దారుణంగా అరోపణలు చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారని. తాను ఆత్మహత్య చేసుకోవడానికే రోడ్డు పక్కన ఆగిఉన్న మరో కారును ఢీ కొట్టినట్లు చెప్పుకొచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పలాస పోలీసులు.. నిర్లక్ష్యంగా కారు డ్రైవ్‌ చేసి ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారని కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed