అత్యంత కీలక దశలో కేసు విచారణ...మేం జోక్యం చేసుకోలేం : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు

by Seetharam |   ( Updated:2023-09-22 10:13:20.0  )
ap highcourt
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు 68 పేజీలతో కూడిన తీర్పు కాపీని వెల్లడించింది. ‘విచారణ అర్హత నేరాల్లో కోర్జుల జోక్యం సరికాదు. విచారణ తొలి దశలో ఉన్నప్పుడు అడ్డుకోవడం సరికాదు. అసాధారణ పరిస్థితులు ఉంటేనే ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలి.ఎఫ్ఐఆర్ లో అన్ని విషయాలు ఉండాల్సిన అవసరం లేదు. విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వాలి అని హైకోర్టు స్పష్టం చేసింది. 140 మంది సాక్షులను విచారిచి 4000 డాక్యుమెంట్లను సిద్ధం చేసిందని హైకోర్టు అభిప్రాయపడింది. సీఐడీ వాటిపై దర్యాప్తు చేస్తున్నందున తాము ఆపలేమని హైకోర్టు తెలిపింది. స్కిల్ స్కామ్ కేసులో అక్రమార్జనపై దర్యాప్తు జరగాల్సి ఉంది. కేసు విచారణను పారదర్శకంగా జరగాలి. అందుకే క్వాష్ పిటిషన్‌ను కొట్టి వేస్తున్నాం. దాని అనుబంధ పిటిషన్లను కూడా కొట్టివేస్తున్నాం’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Read More : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Advertisement

Next Story

Most Viewed