ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై రాజధాని రైతుల ఫిర్యాదు

by Seetharam |
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై రాజధాని రైతుల ఫిర్యాదు
X

దిశ , డైనమిక్ బ్యూరో : ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి రాజధాని రైతులు షాక్ ఇచ్చారు. మే నెలలో చెల్లించాల్సిన కౌలును దసరా వచ్చినా చెల్లించడంలేదని రాజధాని రైతులు మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి తీరును నిరసిస్తూ రాజధాని రైతులు తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భూములిచ్చిన రైతులకు మే నెల మొదటివారంలో చెల్లించాల్సిన కౌలును ఇప్పటి వరకు చెల్లించలేదని రైతులు ఆరోపించారు. మొత్తం 22,948 రైతులకు సుమారు రూ.183.17 కోట్లు కౌలు చెల్లించాల్సి ఉందని ఫిర్యాదులో రాజధాని రైతులు వివరించారు. నిధుల విడుదలకు జీవో జారీ అయినప్పటికీ రైతుల అకౌంట్లలో డబ్బులు వేయలేదని ఆరోపించారు. సీఆర్పీసీ 166 ప్రకారం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు.

Advertisement

Next Story

Most Viewed