- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cabinet Meeting: కొనసాగుతోన్న కేబినెట్ భేటీ.. అదానీ పవర్‌పై కీలక చర్చ
దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి (Velagapudi) సచివాలయం (Secretariat)లోని బ్లాక్-1లో కేబినెట్ నమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan)తో పాటు మంత్రులు (Ministers), ప్రభుత్వ సలహాదారులు (Government Advisers) హాజరయ్యారు. అయితే, గ్రీన్ ఎనర్జీ (Green Energy) ప్రాజెక్టుల కోసం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Goutham Adani) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ముడుపులు ఇచ్చారన్న అభియోగాల నేపథ్యంలో కేబినెట్ భేటీ (Cabinet Meeting)లో అదానీ పవర్‌పై చర్చ కొనసాగుతోంది. సెకీ (SECI) ఒప్పందంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై మంత్రివర్గ భేటీలో చర్చిస్తున్నారు.
అదానీ పవర్ (Adani Power)పై ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు పవర్ సప్లై అగ్రిమెంట్‌ను పెండింగ్‌లో పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో అదానీ విద్యుత్ ఒప్పందం కారణంగా రూ.1,750 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకు సంబంధించి కేబినెట్ సమావేశంలో పూర్తి వివరాలను సహచరులకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) వివరిస్తున్నారు. విద్యుత్ ధరలు తగ్గించకపోతే ఒప్పందాన్ని రద్దు చేసుకుని పెనాల్టీ చెల్లించడమే ఉత్తమమని అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఒప్పందం రద్దు చేసుకుంటే రాష్ట్ర సర్కార్, అదానీ కంపెనీకి పెనాల్టీగా రూ.2,100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.