మంత్రి పదవిపై మనసులో మాట బయటపెట్టిన బుచ్చయ్య చౌదరి

by Satheesh |   ( Updated:2024-06-14 08:24:54.0  )
మంత్రి పదవిపై మనసులో మాట బయటపెట్టిన బుచ్చయ్య చౌదరి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. బాబుతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, చంద్రబాబు కేబినెట్‌లో ఎవరూ ఊహించని వ్యక్తులకు చోటు దక్కగా.. సీనియర్ నేతలకు బిగ్ షాక్ తగిలింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడుతో పాటు పలువురు సీనియర్ లీడర్స్‌కు మంత్రి మండలిలో చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే మంత్రి దక్కకపోవడంపై బుచ్చయ్య చౌదరి స్పందించారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఏ పదవి లేకున్నా ప్రజాసేవ చేశానని తెలిపారు.

కూటమి అన్నాక ఎన్నో లెక్కలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి ఆశించా.. ఇవ్వడం, ఇవ్వకపోవడం వాళ్ల ఇష్టమన్నారు. మంత్రి పదవి రానందుకు తనకు ఏమి బాధ లేదని అన్నారు. స్పీకర్ పోస్ట్ ఇస్తారా..? ఇంకేదైనా ఇస్తారా..? అన్నది అధిష్టానం ఇష్టమని స్పష్టం చేశారు. అయితే, స్పీకర్ పదవి ఇస్తారా అన్న బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. మంత్రి పదవి దక్కని సీనియర్ నేతకు స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో స్పీకర్ పదవి ఇస్తారేమో అన్న మాజీ మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed