- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
త్వరలో చిత్తూరుకు బుల్లెట్ ట్రైన్.. చెన్నై టు మైసూరు వయా చిత్తూరు
దిశ ప్రతినిధి, చిత్తూరు: చిత్తూరు వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ కొన్ని నెలల్లోనే చిత్తూరు ప్రజలకు ప్రత్యక్షం కానుంది. దీంతో చిత్తూరు ప్రజల చిరకాల వాంఛ త్వరలో సాకారం కానుంది. ఈ బుల్లెట్ ట్రైన్ సౌకర్యవంతంగానే కాకుండా అత్యంత వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. మూడు రాష్ట్రాల ప్రజలకు సరికొత్త అనుభూతిని పంచనుంది. 10 గంటల ప్రయాణాన్ని కేవలం రెండు మూడు గంటల్లోనే అధిగమించేలా ఈ బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనుంది. ఈ మేరకు రైల్వే శాఖ పకడ్బందీగా కసరత్తు చేస్తోంది. రైతులను ఒప్పించి పారదర్శకంగా భూసేకరణకు సన్నాహాలు కూడా చేపట్టింది. దాంతో చెన్నై టు మైసూర్ వయా చిత్తూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కొరకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. చిత్తూరు సమీపంలోని 189 కొత్తపల్లి, కోలార్, కొడహళ్లి, వైట్ ఫీల్డ్, బయపనహళ్లి, ఎలక్ట్రానిక్ సిటీ, కింగేరి, మాండ్య, మైసూర్లలో ఈ బుల్లెట్ ట్రైన్‌కు స్టాపింగులు ఏర్పాటు చేస్తూ స్టేషన్లను నిర్మించనున్నారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో 11.8 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకోనున్నారు.
435 కిలోమీటర్ల స్పెషల్ ట్రాక్ నిర్మాణం..
తమిళనాడులోని చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా కర్ణాటకలోని మైసూరుకు బుల్లెట్ ట్రైన్‌ను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 435 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేపడుతోంది. అంతేకాకుండా 362 కిలోమీటర్ల కారిడార్ ఏర్పాటుకు కూడా చర్యలు చేపడుతున్నారు. దీనిపై ఇప్పటికే ఎన్ హెచ్ ఎన్ ఆర్ సి ఎల్ (నేషనల్ హైవే స్పీడ్ కార్పొరేషన్ లిమిటెడ్) అధికారులు ముమ్మరంగా సర్వే చేపట్టారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ బుల్లెట్ ట్రైన్ పూర్తిగా ఫ్లైఓవర్ పై వేసిన ట్రాక్‌లోనే వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 18 మీటర్ల వెడల్పుతో జిల్లాలో 41 గ్రామాల్లో ఈ ట్రాక్ నిర్మాణం కొరకు మూడు రాష్ట్రాల్లో ఆయా కలెక్టరేట్లలో రైతులతో సమావేశాలు నిర్వహించి వారి నుంచి సేకరించే భూమికి నాలుగు రెట్లుగా పరిహారం ఇచ్చేటట్లు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించి అన్ని రకాల సర్వేలు ఆ లైన్ మెంట్ ఫిక్సింగ్ లను కూడా పూర్తి చేశారు.
భూసేకరణకు అధికారులు చర్యలు
మూడు రాష్ట్రాలను కలిపే విధంగా తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ 340 గ్రామాల మీదుగా ఈ బుల్లెట్ ట్రైన్ రాకపోకలను కొనసాగించే విధంగా అధికారులు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ను తయారు చేశారు. మామూలుగా చెన్నై నుంచి మైసూరు కు రైలులో వెళ్లాలంటే సుమారు పది గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్ ట్రైన్ లో అయితే కేవలం రెండు, మూడు గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఈ ట్రైన్ కు చిత్తూరు పేరుతో గుడిపాల మండలంలోని 189 కొత్తపల్లి వద్ద స్టాపింగును ఏర్పాటు చేస్తే ఆశించిన స్థాయిలో ఉపయోగం ఉండదని నగరవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.