- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:విజయవాడ పై బుడమేరు పంజా..జగన్ మొసలి కన్నీరు కార్చడానికి వచ్చాడన్న టీడీపీ నేత
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా విజయవాడ జిల్లాను వరదలు(Flood) ముంచెత్తాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో వరద తీవ్రత కొనసాగుతుండటంతో వరద బాధితులకు సీఎం ఆదేశాల మేరకు ఆహార సరఫరా(Food supply) కొనసాగుతోంది. అయితే విజయవాడను బుడమేరు వరద(Budameru Flood) నీరు ముంచెత్తడం పై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని ఆరోపించారు.
బుడమేరు డైవర్షన్ కాలువ నుంచి 37,555 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కృష్ణా నదికి తరలించడానికి రూ.464 కోట్లతో సీఎం చంద్రబాబు టెండర్లు పిలిపించారని, పనులు మొదలు పెట్టారని, దాదాపు రూ.150 కోట్ల వరకు ఖర్చు పెట్టారని దేవినేని ఉమా వెల్లడించారు. కానీ వైసీపీ పాలనలో పనులు నిలుపుదల చేసి నేడు వరదలకు కారణమయ్యారని ఫైరయ్యారు. ఈ దుర్మార్గానికి కారణం వైఎస్ జగన్ కాదా? అంటూ నిలదీశారు. చంద్రబాబు పాలనలో ఐదేళ్లలో రూ.68 వేల కోట్లు ఖర్చు పెడితే, జగన్ పాలనలో రూ.32 వేల కోట్లు ఖర్చు పెట్టారు. బుడమేరు కాలువ పనులను ఎందుకు నిలుపుదల చేశావ్? అని ప్రశ్నించారు. ఇవాళ ఈ లక్షలాది మంది వరద బాధితులకు(Flood Victims) సమాధానం చెప్పు అని డిమాండ్ చేశారు. ఇప్పుడేమో వరద బాధితుల వద్దకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని తెలిపారు. బుడమేరు ముంపు బాధితులకు సాయం చేయడానికి ముఖ్యమంత్రి సహా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగారని ఉమా పేర్కొన్నారు.
Read more...
Flood: మళ్లీ భయపెడుతున్న బుడమేరు... ఇళ్లలోకి భారీగా వరద నీరు