- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడప కోర్టుకు బీటెక్ రవి
దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ ఎమ్మెల్సీ,పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవిని కడప కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. ఓ కేసులో బీటెక్ రవి రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు కోర్టులో మాజరుపరిచారు. ఇకపోతే బీటెక్ రవిని ఈ నెల 14న వల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రవేశించబోయే రెండు రోజుల ముందు బీటెక్ రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శించారు. అనంతరం యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు బీటెక్ రవి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి విమానాశ్రయకు వెళ్లారు. అయితే విమానాశ్రయంలో పలికి వెళ్లేందుకు బీటెక్ రవి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీటెక్ రవి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పది నెలల అనంతరం బీటెక్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తోంది. పులివెందులలో బీటెక్ రవి రోజు రోజుకు బలపడుతుండటాన్ని తట్టుకోలేకపోయిన వైసీపీ కావాలనే అక్రమ కేసులు పెట్టి జైలుపాల్జేసిందని టీడీపీ ఆరోపణలు చేసింది.