ప్రాణహాని ఉందన్న బీటెక్ రవి: గన్ మెన్ కేటాయింపు

by Seetharam |
ప్రాణహాని ఉందన్న బీటెక్ రవి: గన్ మెన్ కేటాయింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవికి ప్రభుత్వం గన్‌మెన్ కేటాయింపు చేసింది. వల్లూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్టు అనంతరం ప్రభుత్వం గన్‌మెన్‌ను అధికారులు తొలగించారు. ఇటీవలే బీటెక్ రవి జైలు నుంచి బెయిల్ పై విడుదలైన నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి గన్ మెన్‌ను కేటాయించింది. ఇకపోతే బీటెక్ రవి కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తర్వాత తనకు ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని ఆరోపించారు. తనకు గన్‌మెన్‌ను కేటాయించకపోవడంపై మండిపడ్డారు. గతంలో 1+1 భద్రతా సిబ్బంది కేటాయించారని ఇప్పుడు తొలగించడంపై మండిపడ్డారు. దీంతో ప్రభుత్వం బీటెక్ రవికి గన్‌మెన్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story