BREAKING: ఎన్నికల వేళ సిరాపై నాగబాబు సంచలన వీడియో రిలీజ్.. తక్షణమే చర్యలకు ఆదేశించిన ఈసీ (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:2024-05-13 20:46:15.0  )
BREAKING: ఎన్నికల వేళ సిరాపై నాగబాబు సంచలన వీడియో రిలీజ్.. తక్షణమే చర్యలకు ఆదేశించిన ఈసీ (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: మరికొద్ది గంటల్లో పోలింగ్ ఉందనగా జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబుకు ఈసీ ఝలక్ ఇచ్చింది. తాజాగా, ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఇటీవల నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఓటర్లకు డబ్బు ఇచ్చిన తరువాత గుర్తుగా చేతి వేలికి కూడా సిరా ఇంకు వేస్తున్నారని ఆ వీడియోలో వివరించారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగబాబు ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. అదేవిధంగా ఓటర్ల రాంగ్ ట్రాక్‌లోకి తీసుకెళ్లారంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా భారత ఎన్నికల సంఘం నియమించిన అధికారులకు మాత్రమే చెరగని సిరా ఉపయోగించే అధికారం ఉందని, ఎవరైనా సిరాను వేరే అవసరాకు వినియోగిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈసీ వార్నింగ్ ఇచ్చింది. వాట్సాప్‌లో వైరల్ అవుతున్న వీడియోలను నమ్మొద్దని, ఓటర్లు కూడా నిజానిజాలను తెలుసుకోవాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed