BREAKING: పిఠాపురంలో సంచలనం.. ఓటరు మెడలో ఎర్ర కండువా చూసి వంగ గీతకు ముచ్చెమటలు (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:2024-05-14 14:08:25.0  )
BREAKING: పిఠాపురంలో సంచలనం.. ఓటరు మెడలో ఎర్ర కండువా చూసి వంగ గీతకు ముచ్చెమటలు (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ఒక ఎత్తు అయితే.. పిఠాపురంలో మాత్రం పీక్స్‌కు చేరింది. వైసీపీ నుంచి వంగ గీత బరిలో నిలవగా.. జేనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అక్కడి నుంచి పోటీలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అందరి చూపు ఆ నియోజవర్గంపైనే ఉంది. అంతిమ పోరులో ఎవరు ఎవరిపై విజయం సాధిస్తారనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. రెండు పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టారు. కానీ, వారి గెలుపులో పోల్ మేనేజ్‌మెంట్, కుల సమీకరణలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ పిఠాపురంలో ఓ పోలింగ్ కేంద్రంలో సంచలనం చోటుచేసుకుంది. ఓటేసేందుకు వచ్చిన ఓ యువకుడు తన మెడలో ఎర్ర కండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి వచ్చాడు.

అదే సమయంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత అక్కడికా రావడంతో ఆ కండువాను చూసి ఆమె తీవ్ర అభ్యతరం చెప్పింది. ఆ టవల్ మెడలో ఎలా వేసుకుని వస్తారంటూ పోలింగ్ సిబ్బందిని ప్రశ్నించింది. అందుకు స్పందించిన సదురు యువకుడు.. ‘అధికార అహంకారం తగ్గించుకోండి వంగా గీత గారూ.! ఎర్ర కండువా మా పార్టీ గుర్తు కాదు, అది సామాన్య శ్రామికులు చెమట తుడుచుకునే కండువా. దానిని చూసి ఎందుకు అంత భయపడుతున్నారు? ఎరుపు రంగు కండువా చూస్తేనే ఇంత భయం దేనికి?’ అంటూ ప్రశ్నించాడు. దీంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను జనసేన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ షేర్ చేయగా.. ప్రస్తుతం అది కాస్త విపరీతంగా వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed