- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: వైసీపీ ఎంపీ గొల్ల బాబూరావు కీలక ప్రకటన
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎన్టీయే కూటమిలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రాజ్యసభలో మొత్తం 11 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వీరిలో మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో వైసీపీ బలం రాజ్యసభలో తొమ్మిదికి చేరుకుంది. వీరిలో ముగ్గురు తప్ప మిగిలిన ఏడుగురు ఎన్డీయే వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆర్ కృష్ణయ్య, విజయయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాశ్ చంద్రబోస్ స్పందించి జగన్ వెంటే ఉంటామని తేల్చి చెప్పారు.
ఇక విశాఖ జిల్లాకు చెందిన గొల్ల బాబూరావు కూడా వైసీపీని వీడుతారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన తాజాగా కీలక ప్రకటన చేశారు. తాను జగన్ వెంటే ఉంటానని తెలిపారు. వైసీపీని వీడటంలేదని ఆయన చెప్పారు. రాజకీయాల్లో జీవితాంతం జగన్‌తోనే కలిసి నడుస్తానని తెలిపారు. ఎన్డీయే కూటమిలో తాను చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తనపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని ఎంపీ గొల్ల బాబూరావు వ్యాఖ్యానించారు.