- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: జగన్‌పై రాయి వేస్తే.. పిల్లాడిపై హత్యాయత్నం కేసు పెడతారా: వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై ఓ పిల్లాడు రాయి వేస్తే.. అతడిపై హత్యాయత్నం కేసు పెట్టడం దారుణమని వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కడపలో నిర్వహించిన ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. వారం క్రితం జగన్ అన్నపై రాయితో దాడి జరిగిందని.. ఆ రాయి వేసిన పిల్లాడిపై హత్యాయత్నం కేసు పెట్టారని.. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద జైల్లో ఉంచారని ఆరోపించారు. అదేవిధంగా పులివెందులలోని మురారి చింతల గ్రామంలో వృద్ధ దంపతులపై కొందరు వైసీపీ నేతలు దాడి చేశారని తెలిపారు. కానీ, దాడికి పాల్పడిన వారిపై సాధారణ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.
అదేవిధంగా దాడికి పాల్పడిన వారు దర్జాగా తిరుగుతున్నారని.. ఇదెక్కడి న్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు, జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఏలాంటి గలాటాకు పాల్పడిన వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని పిలుపునిచ్చారు. తన తండ్రి వివేకానంద రెడ్డికి తీరన అన్యాయం చేశారని, రాష్ట్రంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలన్నదే తన కోరిక అని సునీత అన్నారు. రాష్ట్ర ప్రజలకు తమ ఓటును న్యాయం కోసం.. ధర్మం కోసం వేయాలంటూ పిలుపునిచ్చారు. కడప ఎంపీగా వైఎస్ షర్మిలను, ఎమ్మెల్యేగా ధ్రువ కుమారును గెలిపించి వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని వైఎస్ సునీత వేడుకున్నారు.