BREAKING: గీతాంజలి బలవన్మరణంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

by Shiva |   ( Updated:2024-03-12 14:43:39.0  )
BREAKING: గీతాంజలి బలవన్మరణంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెనాలిలో జరిగిన వైసీపీ ‘సిద్ధం’ సభలో ఇంటి పట్టాను అందుకు గీతాంజలి అనే మహిళ బలన్మరణానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సొంతింటి కల నెరవేరిందనే అనందంలో ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె అనూహ్యంగా రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆమె భర్త ప్రతిపక్ష టీడీపీపై దుమ్మెత్తి పోస్తున్నాడు. పలు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో తన భార్య గీతాంజలిపై చెప్పుకోలేని విధంగా ట్రోలింగ్ చేయించారని ఆరోపించాడు.

ఆ అవమానాన్ని తట్టుకోలేకే తన భార్య రైలు కిందపడి ఆత్యహత్యకు పాల్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామంపై తాజాగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. గీతాంజలి బలవన్మరణానికి పాల్పడి ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటామని అన్నారు. మహిళల ప్రతిష్ట, మర్యాదకు భంగం కలిగిస్తే.. చట్టం ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోదని పేర్కొన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబానికి సీఎం జగన్ రూ.‌20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Read More..

గీతాంజలి కేసులో అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. తెరపైకి నిజాలు

Advertisement

Next Story

Most Viewed