- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > BREAKING: శృతిమించిన ప్రధాన పార్టీల నేతల కుమ్ములాట.. మూడు రౌండ్ల కాల్పులు జరిపిన కానిస్టేబుల్
BREAKING: శృతిమించిన ప్రధాన పార్టీల నేతల కుమ్ములాట.. మూడు రౌండ్ల కాల్పులు జరిపిన కానిస్టేబుల్
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ మందకొడిగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా కమ్ములాటలు జరుగుతున్నాయి. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో ఏదో ఒకచోట చెదురుమదురు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండల పరిధిలోని ముటుకుల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కొనసాగుతుండగా పోలింగ్ కేంద్రం ఎదుట వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని ఆపేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినా.. పరిస్థితి చేదాటిపోవడంతో ఓ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న గన్ తీసి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. అనంతరం పరిస్థితి కాస్త సద్దుమణిగింది.
Next Story