- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితులుగా ఉన్న వైసీపీ నేతలను జూలై 16 వరకు అరెస్ట్ చేయకూడదని, వారికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసులో తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది. అయితే, తాజాగా ఆ కేసుపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం మరోసారి ముందస్తు బెయిల్ గడువును జూలై 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, కేసులో ప్రధాన నిందితులుగా దేవినేని అవినాష్, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కార్పొరేటర్లు ఆరవ సత్యం, అంబేద్కర్‌తో సహా మరికొందరిని పోలీసులు గుర్తించారు. తొందరలోనే మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు ముందస్తు బెయిల్‌కు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.