BREAKING: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. నేడు ఈఏపీ‌సెట్ ఫలితాలు విడుదల

by Shiva |
BREAKING: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. నేడు ఈఏపీ‌సెట్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఈఏపీ‌సెట్ చైర్మన్, జేఎన్‌టీయూ కాకినాడ వీసీ ప్రసాదరాజు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కాగా ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జి చైర్మన్‌ రామమోహన్‌రావుతో కలిసి ఫలితాలను విడుదల చేయనున్నారు. జేఎన్‌టీయూ, కాకినాడ నిర్వహించిన ఈఏపీసెట్‌‌ పరీక్షకు మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80,766 మంది పరీక్షలు రాశారు. ఫలితాలను https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే, ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ కలిపి వాటి ఆధారంగా ర్యాంకులను వెల్లడించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed