BREAKING: మాజీ మంత్రి సోమిరెడ్డిపై హత్యాయత్నం.. తృటిలో తప్పిన ప్రమాదం

by Shiva |
BREAKING: మాజీ మంత్రి సోమిరెడ్డిపై హత్యాయత్నం.. తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల వాతావరణం యుద్ధ భూమిని తలపిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లా మనుగోలు మండల పరిధిలోని కట్టుపల్లిలో ‘బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సోమిరెడ్డిని అంతమొందించేందుకు అప్పటికే అక్కడ వైసీపీ చెందిన కొందరు కాపు కాశారు. అనంతరం సోమిరెడ్డి సభా వేదికపైకి వస్తుండగానే వైసీపీకి చెందిన నాయకుడు వెంకటయ్య గడ్డపారతో సొమిరెడ్డిని పొడిచేందుకు దూసుకొచ్చాడు. ఈ క్రమంలో అప్రమత్తమైన సోమిరెడ్డి, అతడి అనుచరులు దాడికి పాల్పడిన వెంకటయ్యను అడ్డుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అయితే అక్కడ పోలీసులు అనూహ్యంగా తిరిగి 11 మంది టీడీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story