BREAKING: ఎయిరిండియా సిబ్బంది నిర్వాకం.. ప్రయాణికుల లగేజీ వదిలేసి బెంగళూరుకు టేకాఫ్

by Shiva |   ( Updated:2024-05-26 09:05:38.0  )
BREAKING: ఎయిరిండియా సిబ్బంది నిర్వాకం.. ప్రయాణికుల లగేజీ వదిలేసి బెంగళూరుకు టేకాఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఎయిర్‌పోర్టులో లగేజీ బెల్ట్ సదుపాయం ఉంటుంది. అయితే, మనం ఎక్కడికైనా ప్రయాణిస్తున్న సమయంలో లగేజీని ఆ బెల్ట్‌పై వేస్తే.. కార్గో టీం అదే ఫ్లయిట్‌లోని లగేజీ సెక్షన్‌‌కు పంపిస్తారు. కానీ, ఆదివారం గన్నవరం ఎయిర్‌పోర్టులో చిత్రం చోటుచేసుకుంది. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్లే ఎయిరిండియా ప్రయాణికుల లగేజీ లేకుండానే బెంగళూరులో ల్యాండ్ అయింది. అందరూ విమానం దిగాక.. తమ లగేజీ కోసం బెల్ట్ వద్ద వెయిట్ చేస్తుండగా ఫ్లయిట్‌లో ఉన్న 13 మంది లగేజీలు కనబడలేదు. దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు తమ లగేజీ ఏదని ప్రశ్నించగా.. గన్నవరంలోనే లగేజీ ఉండిపోయిందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అయితే, లగేజీ వచ్చేంత వరకు బెంగళూరు ఎయిర్‌పోర్టులోనే వెయిట్ చేయాలంటూ సిబ్బంది ఉచిత సలహాలు ఇవ్వడంతో వారితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.

Advertisement

Next Story