- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువగళంకు బ్రేక్: మళ్లీ ఎప్పుడు ప్రారంభం అంటే...
దిశ,డైనమిక్ బ్యూరో: మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మిచౌంగ్ తుపాను నేపథ్యంలో రెడ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో మూడు రోజులపాటు విరామం ప్రకటించారు. ఈనెల 7న తిరిగి యువగళం పాదయాత్రను పున:ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్ద యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. తుపాను ప్రభావం తగ్గాక ఈనెల ఏడు నుంచి శీలంవారిపాకల నుంచి యువగళం ప్రారంభించాలని నిర్ణయించారు. తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం, ఈదురుగాలులు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తుపాను నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొనాలని నారా లోకేశ్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు సూచించిన సంగతి తెలిసిందే.
సహాయక చర్యల్లో పాల్గొనాలని లోకేశ్ పిలుపు
ఏపీకి మిచౌంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉందని విపత్తుల సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. తుపాను సహాయకచర్యల్లో టీడీపీ నేతలు-కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మిచౌంగ్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా యువగళం పాదయాత్రకి విరామం ప్రకటించినట్లు స్పష్టం చేశారు. విపత్తుల సంస్థ జారీ చేసే హెచ్చరికలు ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షిత ప్రదేశాలలో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని కోరారు. అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడేలా మొబైల్ ఫోన్లు చార్జింగ్ ఉంచుకోవాలని, శిథిల భవనాలలో అస్సలు ఉండొద్దని హెచ్చరించారు. టిడిపి కేడర్ స్వచ్ఛందంగా తుఫాన్ సహాయక చర్యలు చేపట్టాలని, ప్రజలకు అండగా నిలవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.