లోకేష్ పాదయాత్రకు బ్రేక్.?

by Nagaya |
లోకేష్ పాదయాత్రకు బ్రేక్.?
X

దిశ, తిరుపతి : మొత్తానికి పెద్దగా జన స్పందన లేకున్నా.. ముక్కుతూ.. మూలుగుతూ అలా మెల్లగా సాగుతూ ఉన్న లోకేష్ యువగళం పాదయాత్రకు ఇప్పుడు ఎన్నికల కోడ్ అడ్డంకి వచ్చింది. పాదయాత్ర ఆపాల్సి వస్తుందేమో అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. దీంతో తొమ్మిది ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈక్రమంలో రాజకీయ నాయకులూ ప్రజలను ప్రభావితం చేసేలా హామీలు ఇస్తూ ప్రసంగాలు చేయరాదు. మరి లోకేష్ పాదయాత్రలో సభల్లో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామని హామీలు ఇస్తున్నారు. మరి ఆయన ఇలా హామీలు ఇవ్వవచ్చా.. అవి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదా అనే సందేహాలు వస్తున్నాయి. దీంతో ఈ విషయం మీద ఒక క్లారిటీ కావాలని జిల్లాల అధికారులు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు. ఇదే తరుణంలో వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకూ తిరుగుతూ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేస్తున్నారు. మరి ఇది కోడ్ ఉల్లంఘన కాదా అనే సందేహమూ ఉంది. దాంతో ఈ రెండింటి మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ ఓకే అంటే ఫర్వాలేదు. అలాగే గడపగడపకూ కార్యక్రమం కూడా వైసీపీ వాళ్ళు కొనసాగిస్తారు. కానీ ఈసీ అభ్యంతరం చెబితే పాదయాత్రకు బ్రేక్ పడుతుందని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed