- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: పార్థసారథికి టికెట్ ఫైనల్ అయినప్పుడు చూద్దాం..బోడేప్రసాద్
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కీలక నేతలు రానున్న ఎన్నికలలో తమ ఉనికిని చాటుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఉన్న పార్టీలో సీటు దొరకని నేతేలు పక్క చూపులు చూస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు ఈ కోవలోకి వస్తారు. వైసీపీలో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పుల నేపథ్యంలో వైఎసీపీ అధిష్టానం వైకిరికి అసహనానికి గురైన నేతలు ఆ పార్టీకి గుడ్ బే చెప్తున్న విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథికి పెనమలూరు టికెట్ విషయంలో పార్టీ తో వచ్చిన విబేధాల కారణంగా ఆయన టీడీపీ గుడికి చేరనున్నారు అనే వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ నుండి పెనమలూరు టికెట్ ఆశించడం పై సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నుండి టీడీపీ లోకి వస్తున్నపార్ధసారధి టీడీపీ నుండి పెనమలూరు టికెట్ ఆశించడం లేదా అసిచకపోవడం అనేది పార్ధసారథి వ్యక్తిగత నిర్ణయం. అయితే టీడీపీ టికెట్ ను ఫైనల్ చేసేది మాత్రం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అని.. అయన పెనమలూరు టికెట్ పార్ధసారథికి ఇస్తే.. అప్పుడు తాను పార్థసారథికి సహకరించాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక గడిచిన 5 ఏళ్ళ కాలంలో తాను పార్టీ కోసం పెనమలూరులో కష్ట పడిన విషయం గుర్తుచేసుకున్నారు. కాగా వైసీపీ అధికారం లోకి వచ్చాక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇబ్బంది పడిన మాట వాస్తవమని.. అయితే అప్పుడు ఎవరైతే టీడీపీని తిట్టారో వాళ్ళు ఇప్పుడు ఆ అధికార ప్రభుత్వంలో ఉండలేక ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే టీడీపీ తలుపులు ఎవరు తట్టిన తెరుచుకుంటాయని.. టీడీపీ లోకి ఎవరు వచ్చిన ఆహ్వానిస్తామని తెలిపారు. ఇక చంద్రబాబును, టీడీపీని తిట్టిన వారికి పుట్ట గతులు ఉండవని హెచ్చరించారు.
Read More..