- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ ఇంటివద్ద బీజేపీ ధర్నా.. మాజీ సీఎం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
దివ్య, వెబ్‌డెస్క్: తాడేపల్లిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తిరుపతి లడ్డూ ప్రసాదంలో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన బీజేపీ యువ మోర్చా నేతలు ఏకంగా జగన్ నివాసాన్ని ముట్టడించారు. ఇంటి బయట బైఠాయించి ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిందంటూ నిరసనకు దిగారు. గత ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని, వెంటనే మాజీ సీఎం హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పలు రిపోర్టులను కూడా ఆధారాలుగా చూపిస్తోంది. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది.