- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతిమ నిర్ణయాలు జరగలేదు.. పొత్తులపై జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: పొత్తులపై కేంద్రపార్టీ నిర్ణయం మేరకే నడుచుకుంటామని ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లో పొత్తులపై క్లారిటీ వస్తుందని తెలిపారు. రాజకీయ నాయకులు కలిసినప్పుడు చర్చలు జరగడం సహజమన్నారు. పొత్తులపై ఇంకా అంతిమ నిర్ణయాలు జరగలేదని జీవీఎల్ స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ బలాన్ని ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ, గ్రామ స్థాయిలోకి బీజేపీని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పార్టీ పటిష్టానాకి ఇతర పార్టీలతో సంబంధంలేదని వ్యాఖ్యానించారు. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ‘పల్లెకు పోదాం’కార్యక్రమంతో గ్రామాల్లోకి వెళ్తున్నామని చెప్పారు. ఇప్పటివరకూ 6 లక్షల గ్రామాలకు వెళ్లి 24 గంటల పాటు ఉండి స్థానిక స్థితిగతులను తెలుసుకున్నామన్నారు. ఏపీలోనూ పెద్ద సంఖ్యంలో గ్రామాలకు వెళ్తున్నామని జీవీఎల్ పేర్కొన్నారు.
నీతి ఆయోగ్ రోడ్డు మ్యాప్‌లో విశాఖకు స్థానం లభించినట్లు ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. విశాఖ గ్రోత్ హబ్‌గా మారుతుందని చెప్పారు. ఈ నెల 15న విశాకలో నీతి ఆయోగ్ సమావేశం జరగనున్నట్లు ఎంపీ జీవీఎల్ తెలిపారు. మరోసారి మోడీ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 404 సీట్లతో మూడోసారి కేంద్రంలో బీజేపీ సర్కార్ వస్తుందని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు.