- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నా వ్యాఖ్యల వెనుక దురుద్దేశం ఉంది: ఎంపీ జీవీఎల్
X
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారశైలితోనే పార్టీ వీడుతున్నట్లు కన్నా ప్రకటించారు. అంతేకాదు ఎంపీ జీవీఎల్ నరసింహారావుపైనా విమర్శలు చేశారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ విమర్శలకు జీవీఎల్ నరసింహరావు కౌంటర్ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తామంతా పార్టీ విధి విధానాల ప్రకారమే పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకే సోము వీర్రాజు పని చేస్తున్నారని తెలిపారు. సోము వీర్రాజుపై కన్నా విమర్శలు సరికాదన్నారు. రాజ్యసభ సభ్యుడిగా తన పరిధిలో మాత్రమే వ్యవహరించానని జీవీఎల్ చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగించిన విషయాన్ని ఈ సందర్భంగా జీవీఎల్ గుర్తు చేశారు.
Advertisement
Next Story