అప్పుడు నియంత.. ఇప్పుడు అవినీతి పాలన విమర్శలు : భానుప్రకాష్ రెడ్డి

by Rani Yarlagadda |   ( Updated:2024-10-18 07:33:06.0  )
అప్పుడు నియంత.. ఇప్పుడు అవినీతి పాలన విమర్శలు : భానుప్రకాష్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త నాటకానికి తెరలేపారని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు ఒక నియంతగా వ్యవహరించిన జగన్.. నేడు కూటమి ప్రభుత్వ పాలన అవినీతి పాలన అని మీడియా ఎదుట విమర్శలు చేస్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ అంటేనే అవినీతి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ అని, కూటమి ప్రభుత్వ పాలన అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసి.. సజ్జల ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి నీతులు చెబుతుంటే ఎవరూ నమ్మరన్నారు. గతంలో వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి మరీ.. టీడీపీ కార్యాలయంపై దాడి చేయించింది సజ్జల కాదా ? అని ప్రశ్నించారు. వైసీపీ అంత నీతి, నిజాయితీగా ఉన్నట్లైతే.. బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.

కాగా.. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే రౌడీషీటర్.. తాను వైసీపీ నేతల ప్రోద్బలంతోనే సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేతలు, మహిళలపై అసభ్యపదజాలాన్ని వాడినట్లు అంగీకరించాడు. 2021లో ఒక వ్యక్తిని బెదిరింది రూ.50 లక్షలు డిమాండ్ చేశాడని అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో బోరుగడ్డ అనిల్ అరెస్టయ్యాడు. గురువారం అతడిని కోర్టులో హాజరు పరుచగా.. అతనికి కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అనిల్ ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed