- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ రెండు కుక్క బిస్కెట్లు వేసింది: చంద్రబాబుపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే, అందులో ఆయన మాట్లాడుతూ.. తాను చంద్రబాబు, పవన్‌కు ఇండియా కూటమిలో చేరమని చెప్పానని, ఒకే దెబ్బకు ప్రధాని పదవితో పాటు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ హోదా కూడా వచ్చి ఉండేదని అన్నారు. బీజేపీ ముష్టిగా రెండు కేబినెట్ మంత్రి పదవులను బిస్కెట్ల రూపంలో చంద్రబాబుకు వేయగానే మోడీకి సపోర్ట్ చేశారని ఆరోపించారు. స్పెషల్ స్టేటస్ ఇచ్చేంత వరకు ఎవరూ మంత్రి పదవులు తీసుకొవద్దని అప్పడే అసలు కథ మొదలు అవుతుందని అన్నారు. వచ్చి రాని ఇంగ్లీష్‌తో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మోడీ ముందు మొకరిల్లేలా మాట్లాడారని.. ఈవీఎంల దయతో గెలిచిన ఆయన రియల్ హీరో కావాలంటే స్పెషల్ స్టేటస్ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్, జగన్ అందరూ తనతో కలిసి పోరాటం చేయాలని.. తాను కచ్చితంగా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని అన్నారు. మరోసారి కేంద్రానికి తెలుగోడి సత్తా ఏంటో చూపిద్దామని కేఏ పాల్ పిలుపునిచ్చారు.