- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనసేన నేతతో భేటీ: టీడీపీతో పొత్తు కోసమా..?
దిశ, వెబ్ డెస్క్: త్వరలో ఏపీ ఎన్నికలు జరనున్నాయి. దీంతో రాజకీయాల్లో పెను మార్పుల చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. వైసీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తోంది. ప్రస్తుతానికి బీజేపీ, జనసేన మిత్ర పక్షంగా ఉన్నాయి. అటు జనసేన, టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్లబోతున్నాయి. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా వైసీపీని ఢీకొట్టబోతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొత్తులపై చంద్రబాబు గానీ, పవన్ గాని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే ఈ మూడు పార్టీలు వచ్చే ఎన్నికలకు కలిసి వెళ్తాయని భావించాల్సి ఉంటుంది. అటు ఏపీ బీజేపీ నేతలు పొత్తులపై సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వం చెబితే చాలు పొత్తులు తమకు ఓకే అని రాష్ట్ర నేతలు మీడియా ముఖంగా చెబుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన నేత నాదెండ్ల మనోహర్‌తో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భేటీ అయ్యారు. సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్‌ను మర్యాదపూర్వకంగానే కలిసినట్టుగా చెప్పారు. జనసేన తమ మిత్రపక్షమని తెలిపారు. పొత్తులపై తమ అభిప్రాయాలను అధిష్టానానికి వివరిస్తామన్నారు. పొత్తులపై అంతిమ నిర్ణయం అధిష్టానానిదేనని స్పష్టం చేశారు.
కాగా పురంధేశ్వరి, మనోహర్ మధ్య పొత్తులపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీని కలుపుకుంటే ఎలా ఉంటుంది, పార్టీ నేతల అభిప్రాయం ఏంటనే విషయాలపైనా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే మెజార్టీ నాయకులు, కార్యకార్తలు మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే గెలుపు ఖాయమనే భావనను వ్యక్తం చేసినట్లు ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల మాదిరిగా మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే జగన్‌ను ఈజీగా ఓడించొచ్చనే అభిప్రాయం ఉందనే విషయాన్ని కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారట. త్వరలో పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి రాష్ట్ర బీజేపీ, జనసేన నాయకుల అభిప్రాయాలను వివరిస్తారని తెలుస్తోంది. మరి బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.