- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: టీడీపీలోకి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి?
దిశ డైనమిక్ బ్యూరో: నేతల మార్పులు చేర్పులతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు టీడీపీ గూటికి మకాం మార్చారు. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 2012 లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి రాయలసీమ పర్యవేక్షణ కమిటీని స్థాపించారు. ఇక ఈ కమిటీ ద్వారా సీఈఓ ప్రాజెక్టుల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారు.
ఇక కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఆర్పీఎస్ ని రద్దు చేశారు. ఇక గత ఎన్నికలకు ముందు టీడీపీ లో చేరాలని యత్నించిన ఫలితం లేకుండా పోయింది. అయితే 2024 ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తిరిగి టీడీపీ లోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక టీడీపీ కండువా కప్పుకునేందుకు జరిగిన చర్చలు సఫలీకృతమైన కోరుతున్న సీట్ల విషయంలోనే తర్జనభర్జన అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో పరమర్స పేరుతో నార భువనేశ్వరితో భేటీ అయ్యారు.
అప్పుడే టీడీపీ లో చేరిక జరగాల్సున్న చంద్రబాబు అరెస్ట్ కారణంగా అలా జరగలేదు. అలానే ప్రస్తుతం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా, ఆయన కూతురు శబరి బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో తండ్రి కూతుర్లు టీడీపీ నుండి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు రాజకీయవర్గాల్లో గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఇక నంద్యాల ఎంపీ, పాణ్యం అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేసేందుకు బైరెడ్డి ఆసక్తిని కనబరుస్తున్నారని.. ఇదే విషయం పై టీడీపీతో చర్చలు జరిపినట్లు సమాచారం.
అయితే నంద్యాల సీటుపై అభ్యంతరం లేకపోయిన పాణ్యం సీటు విషయంలోనే అభ్యంతరం వ్యక్తమైనట్లు సమాచారం. నంద్యాల టీడీపీ ఎంపీ స్థానానికి మాండ్ర శివానంద రెడ్డి.. అలానే పాణ్యం స్థానాన్ని గౌరు చరిత ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీట్ల సర్దుబాటు ఎలా చేస్తుంది..? గౌరు, బైరెడ్డి కుటుంబాల్లో ఎవరికీ ప్రాధాన్యత ఇస్తుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది.