- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చంద్రబాబు కేసు వేళ సీఐడీ చీఫ్‌కు బిగ్ షాక్.. వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి షాక్ తగిలింది. వారిద్దరిపై హైకోర్టులో పిల్ దాఖలైంది. స్కిల్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఏపీ యూనైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో పిల్ వేశారు. సంజయ్, సుధాకర్‌పై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. త్వరలో ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశముంది.
స్కిల్ కేసు దర్యాప్తులో ఉండగా మీడియాకు ఎక్కడం అధికార దుర్వినియోగమే అవుతుందని పిటిషనర్ సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. ఆర్టీఐ దరఖాస్తుకే ఇవ్వని సమాచారం మీడియాలో ఎలా చెప్పారని ప్రశ్నించారు. అంతేకాకుండా హైదరాబాద్, ఢిల్లీలో మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఢిల్లీ టూర్ ఖర్చులు ఎవరి భరించారని నిలదీస్తున్నారు. వ్యక్తిగత లబ్ధి, గుర్తింపు ఆశించకుండా సీఐడీ చీఫ్, ఏఏజీ పనిచేయాలని, దీనిపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు సత్యనారాయణ స్పష్టం చేశారు.