పెళ్లికి సిద్ధమవుతున్న జంటలకు ప్రభుత్వం BIG షాక్.. కీలక ఉత్తర్వులు జారీ

by GSrikanth |
పెళ్లికి సిద్ధమవుతున్న జంటలకు ప్రభుత్వం BIG షాక్.. కీలక ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లిల్ల సీజన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సమ్మర్. వేసవికాలంలో పిల్లలకు సెలవులు, భారీగా ముహూర్తాలు ఉండటంతో ఎక్కువగా వివాహాలు చేసుకుంటారు. రానున్న వేసి కాలంలో మంచి ముహూర్తాలు చూసుకొని పెళ్లిల్లకు సిద్ధమవుతున్న జంటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనూహ్య షాకిచ్చింది. పలు రకాల మ్యారేజ్ రిజిస్ట్రేజన్(హిందూ) ఫీజులను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సాధారణ వివాహ నమోదు ఫీజు రూ.200 ఉండగా.. వాటిని రూ.500 లకు పెంచింది. వివాహ వేదిక వద్దకే సబ్ రిజిస్ట్రార్ వస్తే గతంలో రూ.210 ఛార్జ్ చేస్తుండగా.. ప్రస్తుతం రూ.5000 లకు పెంచింది.

ప్రభుత్వ సెలవు రోజుల్లో వివాహాల నమోదు ఫీజును రూ.5 వేలుగా నిర్ధారించింది. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రికార్డుల పరిశీలన ఫీజును రూపాయి నుంచి రూ.100కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం 1955 హిందూ వివాహ రిజిస్ట్రేషన్‌ చట్టానికి సంబంధించి 1965 మార్చిలో జారీచేసిన ఫీజులను ఇటీవల సవరించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం ఒక శుభవార్త కూడా చెప్పింది. వివాహ రిజిస్ట్రేషన్లు మరింత సులభతరం కానున్నట్లు ప్రకటించింది. ఇకనుంచి ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

Advertisement

Next Story

Most Viewed