విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ : జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణయాదవ్

by Seetharam |
విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ : జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణయాదవ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌కు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వంశీ కృష్ణ యాదవ్‌తోపాటు విశాఖపట్నానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీలో చేరిన అనంతరం ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ మాట్లాడారు. పవన్ కల్యాణ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడినై తాను ఈ పార్టీలో చేరినట్లు వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. కొన్ని శక్తుల కుట్రల తనపట్ల కుట్రలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఈ పరిణామాలే వైసీపీ నుంచి బయటకు వచ్చేలా చేశాయి అని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి మరిన్ని వలసలు ఉంటాయని స్పష్టం చేశారు.

వర్గపోరుతో తలనొప్పి

విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఆ పార్టీని వీడి జనసేన పార్టీలోకి చేరారు.గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వంశీ కృష్ణ యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కార్పోరేటర్‌గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ పదవిని ఆశించారు.అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు బదులుగా హరికుమారికి అవకాశం కల్పించారు. దీంతో వంశీకృష్ణ యాదవ్ అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్ధానిక సంస్ధల కోటాలో వైజాగ్ నుంచి అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో వంశీకృష్ణ యాదవ్ ఘన విజయం సాధించారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన అనంతరం వంశీ కృష్ణకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చేవారిని సైతం వైసీపీలోని ఓ వర్గం అడ్డుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనను పక్కనబెడితే ఎందుకు అని ఎమ్మెల్సీ వంశీకృష్ణ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన నేడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

భీమిలి నుంచి పోటీ

ఇదిలా ఉంటే వంశీకృష్ణ యాదవ్ 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం వంశీ కృష్ణయాదవ్ పీఆర్పీని వీడి వైసీపీలో చేరారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ అధినేత టిక్కెట్ కేటాయించలేదు. దీంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. కనీసం 2024 ఎన్నికల్లోనైనా విశాఖపట్నం తూర్పు టికెట్ ఇస్తారని ఆశించారు. కానీ ఎలాంటి హామీ రాకపోవడంతో ఇక వైసీపీలో ఉండటం ఇష్టంలేక జనసేన గూటికి చేరినట్లు తెలుస్తోంది. ఇకపోతే జనసేన పార్టీ నుంచి టికెట్ హామీ వచ్చినట్లు తెలుస్తోంది. భీమిలి లేదా విశాఖపట్నం తూర్పు టికెట్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. భీమిలి నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా పడతాయని ఫలితంగా వంశీకృష్ణ యాదవ్ గెలుపొందే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed