- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన మేయర్ దంపతులు
దిశ, వెబ్ డెస్క్: ఏలూరులో వైసీపీకి ఊహించని విధంగా పెద్ద షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో.. ఏలూరుకు చెందిన మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎం.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైసీపీ పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచం మైబాబు తో పాటు ఇతర వైసీపీ నేతలు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరారు. వీరికి ఉండవల్లి నివాసంలో పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి లోకేష్. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. "ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ మాత్రం ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని, ప్రభుత్వంపై మాత్రం ప్రతిరోజు దుష్ప్రచారానికి పాల్పడుతుందని మండిపడ్డారు. అయితే తమ ప్రభుత్వం, ఎన్నికలలో ప్రకటించిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తంది" అని లోకేష్ తెలిపారు.
తదనంతరం, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ.. "నియోజక అభివృద్ధి కోసం వచ్చేవారందరికీ తమ పార్టీ స్నేహ హస్తంఅందిస్తుందని, త్వరలోనే దశల వారిగా కార్పొరేటర్లు టీడీపీలో చేరబోతున్నారని అన్నారు. కాగా ఆళ్ల నాని వైసీపీ కార్యకర్తలను వదిలేసి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు" అని తెలిపారు. తర్వాత ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ.. "కొన్ని పరిస్థితుల్లో టీడీపీని వదిలి వైసీపీకి వెళ్లాల్సి వచ్చిందని, కానీ ఆ పార్టీలోకి వెళ్లాక నియోజక వర్గంలో ఏ మాత్రం అభివృద్ధిని కూడా చేయలేకపోయామని తెలిపారు. అయితే త్వరలోనే 40 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరబోతున్నారు" అని మేయర్ షేక్ నూర్జహాన్ వెల్లడించారు.