- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ-జనసేన కూటమికి బిగ్ షాక్.. పొత్తుపై బీజేపీ ఝలక్ ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ బిగ్ షాక్ ఇచ్చింది. బీజేపీ జాతీయ నేత శివప్రకాష్ నేతృత్వంలో కాషాయ పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి 10 మంది ముఖ్య నేతలు హాజరైనట్లు తెలిసింది. పురంధరేశ్వరి సహా కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం లభించింది. ఈ భేటీలో పొత్తు సహా పలు అంశాలపై నేతలు చర్చించారు. టీడీపీ-జనసేన తీరుపై నేతలు ఈ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పొత్తులపై చర్చలు జరుపుతూనే సీట్లు ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఎన్డీఏలో చేరికపై తేల్చని చంద్రబాబు తీరుపై అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో చేరికపై పార్టీలో చర్చించి మళ్లీ చెబుతామని అమిత్ షాకు ఇటీవల చంద్రబాబు తెలిపారు. మళ్లీ బీజేపీతో చర్చలకు టీడీపీ నాయకత్వం ముందుకు రాలేదు. సీట్ల ప్రకటన, చంద్రబాబు తీరుతో బీజేపీ పొత్తు విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఇదే అంశంపై హైదరాబాద్ శివారులో బీజేపీ నేతలు రహస్య మంతనాలు జరుపుతున్నారు. దీంతో పొత్తు అంశంలో బీజేపీ నిర్ణయంపై ఏపీ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Read More : AP పాలిటిక్స్‌లో కీలక పరిణామం.. తెరపైకి బీజేపీ ‘కాపు సీఎం’ నినాదం