దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి బిగ్ రిలీఫ్

by Disha Web Desk 16 |
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్ డెస్క్: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి బిగ్ రిలీఫ్ లభించింది. దెందులూరు సీటుపై క్లారిటీ వచ్చింది. ఈ సీటును కూటమిలో భాగంగా బీజేపీ డిమాండ్ చేసింది. దీంతో చింతమనేనికి సీటుపై సస్పెన్స్ కొనసాగింది. దెందులూరు సీటు బీజేపీకి ఇవ్వాలన్న డిమాండ్‌పై వ్యతిరేకత వచ్చింది. దెందులూరులో టీడీపీనే పోటీ చేయాలని కూటమి నేతలను ఎంపీ అభ్యర్థి మహేశ్ యాదవ్ కోరారు. దీంతో చింతమనేనికి లైన్ క్లియర్ అయింది. చంద్రబాబు ఫోన్ చేశారు. ఆదివారం బీఫామ్ తీసుకెళ్లాలని సూచించారు. ఈ పరిణామంతో దెందులూరు టీడీపీ నేతల్లో ఆనందం వెల్లివిరిసింది. దెందూలూరులో టీడీపీ గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed