బిగ్ బ్రేకింగ్: సుప్రీంకోర్టులో AP ప్రభుత్వానికి భారీ ఊరట

by Satheesh |   ( Updated:2023-05-04 03:08:13.0  )
బిగ్ బ్రేకింగ్: సుప్రీంకోర్టులో AP ప్రభుత్వానికి భారీ ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. కాగా, చంద్రబాబు హాయంలో అవినీతి జరిగిందని.. దీనిపై విచారణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ ఏర్పాటుపై భగ్గుమన్న టీడీపీ నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్‌పై స్టే విధించింది. దీంతో ఏపీ హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కాగా, ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. సిట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. ఈ కేసును మెరిట్ ప్రతిపాదికన విచారించి.. తుది నిర్ణయాన్ని వెలువరించాలని ఏపీ హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది.

Read more:

కన్నీటి సుడిలో రైతులు.. నిందితుల రక్షణలో సీఎం జగన్

Advertisement

Next Story

Most Viewed