- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > ఆంధ్రప్రదేశ్ > BIG News: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ
BIG News: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, వైఎస్ విజయమ్మతో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని విజయమ్మ నివాసానికి వెళ్లి ఆమెతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె హెల్త్ కండీషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. సుమారు 30 నిమిషాల పాటు వారి సంభాషణ కొనసాగింది. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ ప్రధాన్యతలు లేవని.. విజయమ్మపై ఉన్న అభిమానంతోనే ఆమెను జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారంటూ ఆయన అనుచరులు పేర్కొన్నారు. కాగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జేసీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్ల పాటు కొనసాగిన విషయం తెలిసిందే. వైఎస్ కేబినెట్‌లో జేసీ దివాకర్ రెడ్డి మంత్రి కూడా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరింది.
Advertisement
Next Story