Breaking News.. టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ..!

by Mahesh |   ( Updated:2023-02-16 08:13:44.0  )
Breaking News.. టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు ఉదయం బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ అద్యక్షుడిపై కన్నా ఆరోపణలు చేశారు. రాజీనామా అనంతరం ఆయన ఏ పార్టీలో చేరతారు అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ఆయన అనుచరులు మాత్రం కన్నా టీడీపీలో చేరుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. గత వారం ఆయన టీడీపీ నేతలతో హైదరాబాద్‌లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23న లేదా 24న టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. నిజంగా కన్నా టీడీపీలో చేరితే మాత్రం.. టీడీపీ గట్టి మైలేజ్ వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story