BIG BREAKING : రాజకీయాలకు ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై!

by Shiva |
BIG BREAKING : రాజకీయాలకు ఎంపీ గల్లా జయదేవ్ గుడ్ బై!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. రాజకీయాలకు గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్‌ గుడ్‌ బై చెప్పారు. ఇక నుంచి తాను రాజకీలయాలకు దూరంగా ఉండనున్నట్లు గల్లా జయదేవ్‌ వెల్లడింబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే తన నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు తెలియజేశారని సమాచారం.

2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసి గల్లా జయదేవ్ ఎంపీగా రెండు పర్యాయాలు గెలుపొందారు. అనంతరం పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని సమస్యలపై తన గళాన్ని విప్పారు. ఒకనొక దశలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తన సంభాషణతో ఢీకొట్టారు. ఈ క్రమంలో గల్లా జయదేవ్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన కేడర్ విస్మయం వ్యక్తం చేస్తోంది. వ్యక్తిగతంగా పారిశ్రామికవేత్త అయిన గల్లా జయదేవ్ ఎంపీగా పోటీ చేసిన నాటి నుంచి ఆయన బిజినెస్‌పై దృష్టి సారించలేకపోతున్నారని వినికిడి. గత ఐదేళ్ల కాలంలో ఆయన వ్యాపారం విషయంలో కాస్త నష్టపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆంధ్రాలో జగన్ ప్రభుత్వ వేదింపులు భరించలేక అమర్‌రాజ కంపెనీని హైదరాబాద్‌కు తరలించారు. ఈ క్రమంలో తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా గుంటూరు ఎంపీగా తనను రెండు పర్యాయాలు గెలిపించినందుకు గాను గల్లా జయదేవ్ తనకు అత్యంత అప్తులైన నాయకులు, కేడర్‌‌‌కు ధన్యవాదాలు తెలిపేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఆ సమావేశంలో జయదేవ్ కుటుంబ సభ్యులు పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఈ నెల 28న ఆయన లోకేష్‌‌తో పాటు టీడీపీ నేతలతో ఆయన భేటీ కానున్నారని సమాచారం.

Advertisement

Next Story