BIG BREAKING: పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ, వాళ్లకు మాత్రం అక్కడే!

by Shiva |   ( Updated:2024-04-02 12:05:45.0  )
BIG BREAKING: పెన్షన్‌దారులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ, వాళ్లకు మాత్రం అక్కడే!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆసరా పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలకు, వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయకూడదంటూ సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లను పక్కకు పెట్టాలని ఈసీ ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఈ నెల 6 వరకు పెన్షన్లను పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా దివ్యాంగులు, వృద్ధులు, రోగులకు ఇంటి వద్దకే పెన్షన్ తీసుకెళ్లి అందజేయనున్నారు. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు గ్రామ సచివాలయాలు పనిచేయనున్నారు. సిబ్బంది కొరత కారణంగా రెండు కేటగిరీలుగా పెన్షన పంపిణీ ప్రక్రియను చేపట్టనున్నారు.

Advertisement

Next Story