- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపే ప్రిలిమినరీ ఎగ్జామ్
దిశ, వెబ్డెస్క్: ఏపీ సర్కార్ ఇటీవల విడుదల చేసిన 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రేపు (ఆదివారం) ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేసింది. రేపు జరగబోయే కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్కు రాష్ట్రవ్యాప్తంగా 997 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష జరగుతుందని అధికారులు తెలిపారు. 10 గంటల తర్వాత అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.
మొబైల్, వాలెట్, నోట్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని తెలిపారు. అభ్యర్థులు ఎగ్జామ్ హాల్కు హాల్ టికెట్, బ్లూ/ బ్లాక్ పాయింట్ పెన్తో పాటు ఆధార్ కార్డ్/ రేషన్ కార్డ్ వంటి గుర్తింపు కార్డు కచ్చితంగా తీసుకురావాలని అధికారులు సూచించారు. ఎగ్జామ్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా, 6100 కానిస్టేబుల్ పోస్టులకు 5.03 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.