- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నభూతో నభవిష్యత్ అన్నట్లుగా మహానాడు : అచ్చెన్నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ మహానాడు-2023ను నభూతో నభవిష్యత్ అన్న చందంగా నిర్వహిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈనెల 27న 15 వేల మంది ప్రతినిధులతో మహానాడు నిర్వహిస్తామని వెల్లడించారు. 28న తెలుగుదేశం వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల ముగింపు 15 లక్షల మందితో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ శత జయంతి 100 సభలు నిర్వహించామని చెప్పుకొచ్చారు. తొలిరోజు ప్రతినిధుల సభలో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా 15 తీర్మానాలు ప్రవేశపెడతామని తెలిపారు. జగన్ అరాచక పాలన, అవినీతి, మైన్స్, శాండ్, ప్రకృతి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తామని ప్రకటించారు. తెలుగుదేశం మహానాడు-2023 ప్రాంగణ నిర్మాణానికి శుక్రవారం నాడు పవిత్ర గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో శ్రీకారం చుట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఉదయం 9.25 గంటలకు రాజమహేంద్రవరం శివారు వేమగిరిలో జాతీయ రహదారి పక్కన మహానాడు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ మహానాడు ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతుంటే, వైసీపీ కవ్వింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఈ నెలాఖరు వరకు రాజమండ్రి సిటీతో పాటు పరిసర ప్రాంతాల హోర్డింగులన్నీ బ్లాక్ చేసి, టీడీపీ వారికి బోర్డులు ఇవ్వరాదని అడ్వర్టయిజ్మెంట్ ఏజెన్సీలకు హుకుం జారీ చేయడాన్ని అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. వైసీపీ కవ్వింపు చర్యలు ఆపకపోతే ప్రజలలో తిరుగుబాటు తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. మహానాడు విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర కమిటీలు వేశామని, జిల్లా స్థాయిలో కూడా కమిటీలు వేసి అందరి సహకారం తీసుకుంటామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్న జగన్: కళా వెంకట్రావు
ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి చాటిచెబితే...ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడని రాష్ట్ర టీడీపీ మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ పాలన పోవాలి.. మళ్ళీ చంద్రబాబు పాలన రావాలి... అని ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దళిత, బలహీన వర్గాల సంక్షేమం కోసం చంద్రబాబు పాలన రావాలన్నారు. జగన్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ఈ మహానాడు నాంది పలుకుతుందని రాష్ట్ర టీడీపీ మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు చెప్పుకొచ్చారు. భారతదేశ చరిత్రలోనే మహానాడు ఒక అపూర్వ అధ్యాయం అని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభివర్ణించారు. అన్న ఎన్టీఆర్ జన్మదినాన్ని మహానాడు పండుగగా జరుపుకోవడం తెలుగు ప్రజలందరికీ ఆనందదాయకమని అన్నారు. మహానాడు ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నామని, గోదావరి పుష్కరాలకు వచ్చిన అతిధులను ఆదరించిన మాదిరి అందరినీ ఆదరిస్తామని తెలిపారు. రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల పరిధిలో కూడా మహానాడు కమిటీలు వేస్తామని, అందరూ ఈ పండుగ విజయవంతంలో భాగస్వాములు కావాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు.
జగన్ ఓటమే ధ్యేయంగా పనిచేయాలి : చినరాజప్ప
మహానాడు కార్యక్మర్తల పండుగ అని, మహానాడు, ఎన్టీఆర్ వందవ పుట్టిన రోజు వైభవంగా నిర్వహించేందుకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధంగా ఉన్నాయని పెద్దాపురం ఎమ్మెల్యే, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. జగన్ ను తరిమికొట్టి, చంద్రబాబును సీఎం చేస్తామని ప్రజలే చెబుతున్నారని అన్నారు. జగన్ ఓటమే ధ్యేయంగా విపక్షాలు పని చేస్తున్నాయని, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని ప్రకటించారని చినరాజప్ప చెప్పారు. పవిత్ర గోదావరి తీరం మహానాడుకు సిద్ధమవుతోందని, లక్షలాదిగా జనం తరలి వచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఈ భూమి పూజ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, పి. అశోక్ బాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, బీదా రవిచంద్ర యాదవ్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు కె.ఎస్. జవహర్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, అమలాపురం పార్లమెంట్ టీడీపీ ఇన్ చార్జి గంటి హరీష్ బాలయోగి, తెలంగాణ తెలుగుయువత అధ్యక్షులు పొగాకు జయరాం చందర్ ఇతర టీడీపీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read.
రైతు బాంధవులుగా పవన్, చంద్రబాబులు వేషాలు వేస్తున్నారు : సీఎం వైఎస్ జగన్