- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెదకూరపాడు టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్?.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు టికెట్ లేనట్లేనా!
దిశ ప్రతినిధి, గుంటూరు: పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసినట్టు తెలిసింది. ప్రవీణ్ పేరు తొలుత గుంటూరు పశ్చిమలో వినిపించింది. ఆ తరువాత చిలకలూరిపేట టికెట్ ఇస్తున్నారని చాలా కాలం ప్రచారం సాగింది. ఎట్టకేలకు ఆయనకు పెదకూరపాడు టికెట్‌ను ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రవీణ్‌కు పార్టీ అధిష్టానం సమాచారం అందించినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేయాలని భావించారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఓడి పోయారు. గడిచిన ఎన్నికలకు ముందు టీడీపీలో కొందరు నాయకులు ఆయనను వ్యతిరేకిస్తూ వైసీపీలో చేరారు. తిరిగి వారంతా మళ్లీ ఇటీవల టీడీపీలో చేరారు. పెదకూరపాడులో శ్రీధర్‌కు అనుకూల వాతావరణం లేదన్న సర్వే నివేదికల కారణంగా ఆయన స్థానంలో ప్రవీణ్‌ను ఎంపిక చేశారని పార్టీ కేంద్ర కార్యాలయం వర్గాల ద్వారా తెలిసింది.