మంత్రి Roja పై బండారు వ్యాఖ్యలు : తప్పేమీ లేదన్న Chintamaneni Prabhakar

by Seetharam |   ( Updated:2023-10-03 15:40:20.0  )
chintamaneni
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజాపై మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. దీంతో మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగింది. బండారు సత్యనారాయణను అరెస్ట్ చేయాలని ఆదేశించడంతో అరెస్ట్ సైతం అయ్యారు. అయితే మాజీమంత్రి బండారు వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమర్థించారు. బండారు వ్యాఖ్యల్లో తనకు తప్పేమీ కనిపించడం లేదని అన్నారు. గతంలో వైసీపీ నేతలు ఏకంగా అసెంబ్లీలోనే తెలుగుదేశం నాయకులపై అసభ్య వ్యాఖ్యలు చేశారని చింతమనేని ప్రభాకర్ గుర్తు చేశారు. ప్రస్తుతం బండారు సత్యనారాయణ మూర్తిని తప్పుబడుతున్న నేతలంతా అప్పుడు ఏమయ్యారని చింతమనేని ప్రభాకర్ నిలదీశారు. నిండు అసెంబ్లీలో టీడీపీ నేతలపై అసభ్య పదజాలంతో వైసీపీ నేతలు విరుచుకుపడినవి తప్పుగా కనిపించడం లేదు కానీ ఇప్పుడు రోజాపై సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తప్పుగా కనిపిస్తున్నాయా అని చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టడం పరిపాటిగా మారిందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.

ఇవి కూడా చదవండి : పాపం రోజా.. తీవ్ర కంటతడి

Advertisement

Next Story