- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయం!
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి భారీ షాక్ తగలింది. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. గత కొంత కాలంగా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. తాజాగా రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. బాలినేని ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా వ్యవహారిస్తున్నారు.
వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఆ బాధ్యతల నుండి తప్పుకుంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక, బాలినేని స్వల్ప అస్వస్థతో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక, జగన్ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి.. సీఎం జగన్ చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో రెండవ సారి మంత్రిగా అవకాశం దక్కలేదు. దీంతో అప్పటి నుండి బాలినేని వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తారంటూ కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి.
Also Read..
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దొంగ చంద్రబాబు: మంత్రి రోజా ఫైర్