Balineni Srinivas: వైసీపీకి మరో బిగ్ షాక్‌.. పార్టీకి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి గుడ్‌బై!

by Shiva |   ( Updated:2024-09-13 10:45:22.0  )
Balineni Srinivas: వైసీపీకి మరో బిగ్ షాక్‌.. పార్టీకి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి గుడ్‌బై!
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమై చావుదెబ్బ తిన్న వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయిన ఆ పార్టీకి ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభకు నామినేట్ అయిన ఎంపీలు సైతం రాజీనామా చేస్తున్నారు. దీంతో వైసీపీ కేడర్, దిగువ శ్రేణి నాయకుల్లో నైరాశ్యం నెలకొంది. ఈ క్రమంలోనే ఒంగోలు పరిధిలో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తుంది.

మాజీ మంత్రి, జగన్‌కు బంధువైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి త్వరలోనే రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితులు, అనుచరులకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, నిన్న సాయంత్రం ఆ విషయం కాస్త పార్టీ అధినేత జగన్ వద్దకు వెళ్లడంతో అక్కడి నుంచి బాలినేనికి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిసినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. గత కొంతకాలంగా పార్టీకి బాలినేని దూరంగా ఉంటూ వస్తున్నారు. నేడో, రేపో పార్టీకి బాలినేని గుడ్ బై చెబుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతలు కూడా ఆయన రాజీనామాపై రకరకాలుగా స్పందిస్తున్నారు. పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకే బాలినేని రాజీనామా డ్రామాలు ఆడుతున్నాడని ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే.. ఏ పార్టీలో చేరతారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బాలినేనికి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన ఆ పార్టీలో చేరుతారని ప్రచారం ఊపందుకుంది. టీడీపీ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ రావుతో బాలినేని విబేధాలు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలో వెళ్లబోడని తెలుస్తోంది. ఇక పార్టీ మారే విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read more : రజనితో రాయబారం..బాలినేనికి వైసీపీ బుజ్జగింపులు!

Advertisement

Next Story

Most Viewed