దెబ్బకు దెబ్బ.. కోతకు కోత.. ఇక చూస్కో... సీఎం జగన్‌కు బాలయ్య మాస్ వార్నింగ్

by Javid Pasha |   ( Updated:2023-09-30 11:28:15.0  )
దెబ్బకు దెబ్బ.. కోతకు కోత.. ఇక చూస్కో... సీఎం జగన్‌కు బాలయ్య మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‌కు సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. దెబ్బకు దెబ్బ.. కోతకు కోత అని హెచ్చరించారు. కేసులకు టీడీపీ భయపడే ప్రసక్తే లేదని, చంద్రబాబు కోసం చనిపోయిన వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. వారి కుటుంబాలను త్వరలోనే పరామర్శిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు టీడీపీ మద్దతు ఉంటుందని బాలయ్య తెలిపారు.రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై స్కిల్ కేసులు పెట్టారని, చంద్రబాబు ఏ తప్పు చేయలేదని బాలయ్య తెలిపారు.

ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని, తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా భయపడాల్సిన అవసరం లేదని బాలయ్య తెలిపారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆరోపించారు. చంద్రబాబుపై కేసు అభూత కల్పన అని, అందులో ఏమీ లేదన్నారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి జరిగిందని ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అయినా అక్రమంగా కేసుల పెట్టారని విమర్శించారు. ఏపీని అభివృద్ది చేయాలనే ఆలోచన జగన్‌కు లేదని, పదేళ్ల నుంచి బెయిల్‌పై బయట తిరుగుతున్నారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed