Nandamuri Balakrishna: విజయవాడకు రజినీకాంత్.. స్వాగతం పలికిన బాలకృష్ణ (ఫొటోస్)

by GSrikanth |   ( Updated:2023-04-28 15:09:20.0  )
Nandamuri Balakrishna: విజయవాడకు రజినీకాంత్.. స్వాగతం పలికిన బాలకృష్ణ (ఫొటోస్)
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడ చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజినీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఇందులో భాగంగా గన్నవరం విమానాశ్రయంలో రజనీకి నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి ఒకే వాహనంలో వెళ్లిపోయారు. ఇకపోతే శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజనీకాంత్‌కి టీడీపీ అధినేత చంద్రబాబు తేనీటి విందు ఇవ్వనున్నారు. అనంతరం చంద్రబాబు, బాలకృష్ణ, రజినీకాంత్‌లు పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు.

అసెంబ్లీలో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను రజినీకాంత్ ఆవిష్కరించనున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు అనుమోలు గార్డెన్స్‌ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకల్లో 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణాన్ని మూడు భాగాలుగా విభజించారు. ‘ఎన్’ విభాగంలో విశిష్ఠ అతిథులు, ‘టి’ విభాగంలో అతిథులు, ‘ఆర్’ విభాగంలో సామాన్యులు కూర్చునేందుకు వీలుగా కమిటీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల నుంచి గ్యాలరీల్లోకి ప్రజలను అనుమతిస్తారు. ప్రాంగణం చుట్టూ మరో 20 వేల మంది వరకు కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.


Also Read: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. అదిరిపోయిన కొత్త సినిమా టైటిల్!








Advertisement

Next Story

Most Viewed