- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రత చర్యలు..మాక్ డ్రిల్ ద్వారా అవగాహన
దిశ,కాకినాడ : వివిధ కర్మాగారాల్లో అనుకోకుండా ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్ట నివారణ చర్యలు తీసుకునే విధంగా సకల ఏర్పాట్లను పరిశ్రమల శాఖల యజమానులు సిద్ధంగా ఉంచుకోవాలని ఫ్యాక్టరీ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ తెలిపారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేంద్ర,రాష్ట్ర విపత్తుల సంస్థల ఆధ్వర్యంలో వివిధ శాఖల సహకారం తో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా కాకినాడలోని ఎన్సీఎస్ స్టోరేజ్, దేవి ఫిషరీస్ వంటి పలు కర్మాగారాల్లో ఎక్కువగా అమ్మోనియం గ్యాస్ వినియోగిస్తారని ప్రమాదం సంభవించినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అనే అంశంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని విలేకరుల సమావేశంలో వివరించారు.నగరంలో ఎక్కువగా అమ్మోనీయం వినియోగిస్తున్నారని ఇది లీకై ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు సూచనలు వారికి వివరించామన్నారు. ప్రమాదాలు సంభవించి నప్పుడు అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయా లేదా అనే అంశంపై కూడా ఈ మాక్ డ్రిల్ ద్వారా తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట తహశీల్దార్ వై. శ్రీనివాస్,రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ లెఫ్టినెంట్ కమాండర్ కట్టా సాంబయ్య తో పాటు వైద్య ఆరోగ్య, విద్యుత్, కాలుష్య నివారణ మండలి, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Read More..
బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థి పై కొనసాగుతున్న చర్చలు..ఈసారి స్థానికేతరుల కేనా?